శరణు శరణు.. భవానీ! | Refuge refuge .. Bhavani! | Sakshi
Sakshi News home page

శరణు శరణు.. భవానీ!

Published Mon, Dec 16 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

Refuge refuge .. Bhavani!

విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రెండు రోజులు జరిగిన ఏపీ స్టేట్ పైకా పోటీలు ఆదివారం ముగిశాయి. గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీలు బాలికల విభాగంలో కృష్ణా జట్టు టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహిళా టెన్నిస్ టోర్నీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ, కృష్ణా జట్టు చతుర్థస్థానాల్లో నిలిచాయి. పైకా గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీల్లో నిజామాబాద్, రంగారెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.

బాలుర విభాగంలో విశాఖపట్నం జట్టు టీమ్ చాంపియన్‌గా నిలువగా, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా జట్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. టెన్నిస్ టీమ్ ఈ వెంట్‌లో హైదరాబాద్ జట్టు 3-0 తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. ఫైనల్స్‌లో అనూష(హైదరాబాద్) 9-1 తేడాతో సాయినిఖిత(రంగారెడ్డి)పై, అలేఖ్య(హైదరాబాద్) 9-6 తేడాతో శైలజా(రంగారెడ్డి)పై, డబుల్స్‌లో అనూష, సింధు(హైదరాబాద్) జోడీ 9-6 తేడాతో సాయినిఖిత, సహజా(రంగారెడ్డి) జోడీపై విజయం సాధించారు.

ఆర్చరీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విశాఖపట్నం జట్టు 1442 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50 మీటర్లు, 30 మీటర్ల డిస్టెన్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన విశాఖపట్నం జట్టులో ఎస్.రమేష్  254, 293 పాయింట్లు, ఎ.బాబురావు 201, 260, జి.మహేష్‌బాబు 203, 231, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్టులో పి.నూతన్‌కుమార్ 231, 236,  ఎ.గణేష్ 188, 270, పి.వంశి 185, 200, ఎన్.అశోక్ 85, 125, తృతీయ స్థానం సాధించిన ఖమ్మం జట్టులో పి.నగేష్ 250, 275, కె.నవీన్ 217, 226, టి.కల్యాణ్ 123, 149 పాయింట్లు పొందారు.
 
బాలికల విభాగంలో...

టీమ్ చాంపియన్‌షిప్ సాధించిన కృష్ణా జట్టు 955 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50, 30 మీటర్ల డిస్టెన్స్‌లో పి.జయవినీల 91, 244, ఎ.శ్వేత 142, 183, ఎస్.ఎస్.భవాని 77, 218, ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టులో బి.నవ్యశ్రీ 197, 262, పి.గాయత్రి 161, 158, ఎం.కీర్తన 24, 58, తృతీయ స్థానం పొందిన రంగారెడ్డి జట్టులో బి.కావ్య 158, 159, ఎ.ప్రియాంక 17, 109, ఎస్‌డీ అఫ్రీన్ 5, 57 పాయింట్లు సాధించారు.
 
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి

చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని విజయవాడ సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.  ఏపీ స్టేట్ పైకా మహిళా టెన్నిస్ టోర్నీ, ఆర్చరీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు పైకా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్ జి.చిన్నయ్య మాట్లాడుతూ, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఆయా జిల్లాలకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. డీఎస్‌డీవో పి.రామకృష్ణ, ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె.పట్టాభిరామయ్య, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement