![నేటి నుంచి విజయవాడలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్](/styles/webp/s3/article_images/2017/09/2/81416943774_625x300.jpg.webp?itok=LNKlopgc)
నేటి నుంచి విజయవాడలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బుధవారం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరుగుతాయి. 26 రాష్ట్రాల నుంచి సుమారు 3వేల మంది జూనియర్ బాలబాలికలు బరిలోకి దిగుతున్నారు. 30వ తేదీ వరకు 150 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. జూనియర్ ఏషియాడ్, జూనియర్ కామన్వెల్త్ మీట్‌లకు ఈ పోటీల ద్వారా అథ్లెట్లను ఎంపిక చేస్తారు.