తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఎన్జీవోల నిరసన | NGO's protest in front of 'Telugu Talli' Statue | Sakshi
Sakshi News home page

తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఎన్జీవోల నిరసన

Published Sun, Oct 27 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

NGO's protest in front of 'Telugu Talli' Statue

శ్రీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రామిరెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహం ఎదుట సమైక్య నినాదాలుచేసి నిరసనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏపీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్, జిల్లా జాయింట్ సెక్రటరీలు షేక్ బాజిత్, దరియావలి, నగర అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్, వివిధ శాఖల ఉద్యోగ నాయకులు ప్రసాద్‌లింగం, మూర్తి, మస్తాన్, వెంకటరెడ్డి, అనిల్, ఫణీంద్ర, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement