బంద్ విజయవంతానికి సహకరించాలి
Published Tue, Sep 24 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: విభజనకు నిరసనగా మంగళవారం తలపెట్టిన రాష్ట్రబంద్ విజయంతానికి అన్ని వర్గాలు సహకరించాలని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రవీంద్రబాబు పిలుపు నిచ్చారు. బంద్‌కు ప్రజలను సమాయత్తం చేసేందుకు సోమవారం రాత్రి ఆటోల్లో మైకు ప్రచారం, మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఎన్‌జీఓ భవన్ వద్ద ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటల నుంచే జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వాణిజ్య, వర్తక వర్గాలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. విద్యా సంస్థల బంద్ యథాతథంగా కొనసాగుతుందన్నారు. బుధ, గురువారాల్లో ట్రావెల్స్ వాహనాల బంద్ నిర్వహిస్తామన్నారు. శుక్ర, శనివారాల్లో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. మోటారు సైకిళ్ల ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సుధాకరరావు, శ్రీకాంత్, శేఖరరావు, సతీష్, శివప్రసాద్, వెంకమరాజు, ఆంజనేయవర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement