నేడు బంద్ వైఎస్సార్‌సీపీ
Published Tue, Sep 24 2013 2:31 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. విజయవంతం చేసేందుకు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్పంచుకోవాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు,
సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ పాటించనున్నాయి. ప్రైవేట్ వాహనాలతో పాటు ఆటోలు కూడా నిలిచిపోతుండటంతో బంద్ సంపూర్ణం కానుంది. 18, 44వ జాతీయ రహదారులతో పాటు, జిల్లాలోని ప్రధాన రహదారుల దిగ్బంధించనుండటంతో రాకపోకలు స్తంభించనున్నాయి. కర్నూలులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మూడు బృందాలుగా విడిపోయి బంద్‌ను పర్యవేక్షించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి, కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్, కో-చైర్మన్ సంపత్‌కుమార్, కోశాధికారి శ్రీరాములు తెలిపారు. బంద్‌ను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు.. ప్రజాసంఘాలు సహకరించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement