
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షునిగా ఉన్న ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ సర్వీస్ నుంచి బుధవారం రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి శ్రీనివాసరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన స్థానంలో వైఎస్సార్ జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షునిగా ఉన్న కేవీ శివారెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
చదవండి: డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు