సభకు రాజకీయ నేతలొస్తే తప్పేంటి?: ఆశోక్‌బాబు
తమ సభకు రావాలని రాజకీయ నేతలను ఆహ్వానించామని ఎపీఎన్జీవో నాయకుడు ఆశోక్‌బాబు తెలిపారు. తమ సభకు రాజకీయ నేతలు వస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ తమ సభను అడ్డుకుంటే ఢిల్లీలో తెలంగాణను అడ్డుకోగలమని అన్నారు. శాంతియుతంగానే సభ జరుపుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. సభ ఏర్పాట్ల విషయంలో అధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.
రేపు సాయంత్రం నుంచి ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులు చెబుతున్నారని వాపోయారు. సభకు ఒకరోజు ముందునుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తే సకాలానికి పూర్తికావని చెప్పారు. కొందరు అధికారులు, పోలీసులు ప్రాంతీయ వాదాన్ని చూపిస్తున్నారని అన్నారు. 7న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న సభకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. సభకు ఆటంకం కలిగించాలని కొందరు మంత్రులు చూస్తున్నారని అశోక్బాబు ఆరోపించారు.