కేంద్ర మంత్రుల ఓటమే మా లక్ష్యం: ఏపీఎన్జీవో నేతలు | APNGO leaders vow to defeat seemandhra central ministers | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రుల ఓటమే మా లక్ష్యం: ఏపీఎన్జీవో నేతలు

Published Thu, Nov 21 2013 5:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

APNGO leaders vow to defeat seemandhra central ministers

సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర మంత్రులను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీవో నేతలు హెచ్చరించారు. కేంద్ర మంత్రులను రాజకీయంగా సమాధి చేస్తామని, వారికంటే తమ స్థాయే పెద్దదని తెలిపారు.

అసెంబ్లీకి బిల్లు వచ్చే సమయంలో చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తామని, అలాగే పార్లమెంట్‌లో బిల్లు వచ్చే సమయంలో చలో పార్లమెంట్‌ నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెతో పాటు అన్ని అంశాలపై ఈ నెల 24న కీలక సమావేశం నిర్వహిస్తామని, అందులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తోడ్పడతాయని భావిస్తున్నట్లు ఏపీఎన్జీవో నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement