6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె | Seemandhra employees strike from February 6th | Sakshi
Sakshi News home page

6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె

Published Mon, Feb 3 2014 6:27 PM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM

Seemandhra employees strike from February 6th

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు మళ్లీ సమ్మె భేరి మోగించబోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

 7, 8, 9 తేదీల్లో కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ పాటించనున్నారు. ఆ తర్వాత 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement