అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే పదిలక్షల మందితో ముట్టడిస్తామని చెప్పిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఇప్పుడెక్కడ ఉన్నారని వాణిజ్య పన్నుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ ప్రశ్నించారు.
సాక్షి, విజయవాడ: అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే పదిలక్షల మందితో ముట్టడిస్తామని చెప్పిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఇప్పుడెక్కడ ఉన్నారని వాణిజ్య పన్నుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈరోజు చాలా పత్రికల్లో అశోక్‌బాబుపై పోటీ చేస్తే సమైక్యవాదానికి వ్యతిరేకంగా పోటీ చేసినట్లేనని, ఒక రాజకీయ పార్టీ వద్ద డబ్బులు తీసుకుని పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ ఎన్జీవో సంఘం అశోక్‌బాబు వ్యక్తిగతం కాదని, తనపై పోటీ చేయడాన్ని సహించలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికలు పెట్టకుండా తానే అధ్యక్షుడినని ప్రకటించుకొని ఉంటే బాగుండేదన్నారు. హైకోర్టులో స్టే ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అశోక్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.