సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈనెల 7వ తేదీన ఏపీఎన్‌జీవోలు తలపెట్టిన సమైక్యసభకు అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డిని సోమవారం కలసి వినతిపత్రం సమర్పించారు. కొందరు పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు సమైక్య నినాదం తో హైదరాబాద్‌లో సభలు పెట్టించడం ద్వారా ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు సీహెచ్ ఉపేంద్ర, కె.గోవర్ధన్‌రెడ్డి, జనార్దనగౌడ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు అదనపు డీజీని కలిసిన వారిలో ఉన్నారు.
ఆంధ్రుల సభను అడ్డుకుంటాం: పిడమర్తి రవి
7వ తేదీన సీమాంధ్రులు నగరంలో నిర్వహించ తలపెట్టిన సభను అడ్డుకుంటామని టీఎస్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం ఓయూ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నెల 4న అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
వారి సభకు అనుమతివ్వొద్దు: టీ అడ్వకేట్ జేఏసీ
Published Tue, Sep 3 2013 6:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement