రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీలో ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ ‘న్యూస్‌లైన్’కు ఫోన్‌లో తెలిపారు.
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీలో ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ ‘న్యూస్‌లైన్’కు ఫోన్‌లో తెలిపారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.
సమైక్యాంధ్రే సీమాంధ్రుల ఆకాంక్షని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రధానికి వివరించారన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్, ఏలూరు నగరశాఖ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రమేష్‌కుమార్, నాయకులు సందీప్‌గౌడ్, ఎన్‌ఎంయూ ఏలూరు రీజినల్ కార్యదర్శి ప్రసాద్ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారన్నారు.