ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : సీమాంధ్ర కేంద్ర మంత్రుల కళ్లకు పట్టిన హైకమాండ్ అనే పొరను తొలగించి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్‌లోని దీక్షా శిబిరం వద్ద కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, పళ్ళం రాజు తదితరుల చిత్రపటాలలోని కళ్లను తుడిచి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రులు స్వతహాగా మంచివారైనా వారికి హైకమాండ్ అనే పొర కళ్లకు కమ్ముకుందని తెలిపారు. ఈ కారణంగానే రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరించలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా హైకమాండ్‌ను ఎదిరించి రాష్ట్ర విభజనను నిలిపివేయడానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధామస్, సుభాకరరత్నం, హనుమంతరావు, భాస్కరలక్ష్మి, పూర్ణశ్రీ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ జేఏసీ వినూత్న నిరసన
Published Wed, Jan 1 2014 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement