సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసినట్లు ఆయన తెలిపారు. విజయమ్మతో భేటీ అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడాలన్నది విజయమ్మ గారి అభిప్రాయమన్నారు.
న్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచాలని విజయమ్మ డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉద్యోగు సంఘాల ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిదింగా ఆమెను కోరినట్లు తెలిపారు. విజయమ్మ చేపట్టబోయే దీక్షకు ఏపీఎన్జీవోలు మద్దతు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి అన్నారు.