అశోక్ బాబు తీరు టీ.జేఏసీని తలపిస్తోంది:ఎంపీ వెంకట్రామిరెడ్డి | ananta venkatarami reddy takes on ashok babu | Sakshi
Sakshi News home page

అశోక్ బాబు తీరు టీ.జేఏసీని తలపిస్తోంది:ఎంపీ వెంకట్రామిరెడ్డి

Published Sat, Nov 30 2013 4:46 PM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM

అశోక్ బాబు తీరు టీ.జేఏసీని తలపిస్తోంది:ఎంపీ వెంకట్రామిరెడ్డి - Sakshi

అశోక్ బాబు తీరు టీ.జేఏసీని తలపిస్తోంది:ఎంపీ వెంకట్రామిరెడ్డి

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబుపై అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

అనంత: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబుపై అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అశోక్ బాబు వ్యవరిస్తున్న తీరు టీ.జేఏసీని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన అశోక్ బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఎంపీలపై అశోక్ పదజాలం బాగోలేదని, ఆయన ఇప్పటికైనా వైఖరిని మార్చుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సరిపోదని అనంత అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలన్నీ పరిష్కరించాకే ముందుకెళ్లాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గాడిదలు.. మూర్ఖులు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిస సంగతి తెలిసిందే. సమైక్య ఉద్యమంలో ఐదేళ్ల పిల్లవాడి నుంచి వయో వృద్ధుల వరకు పెద్దఎత్తున పాల్గొంటే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement