సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనడం, ఎంపీలనూ సస్పెండ్ చేయడం అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆడిస్తున్న డ్రామాలో భాగమని ఏపీఎన్జీవో నేత సత్యనారాయణ అన్నారు.
'సీఎం రాజీనామా చేస్తా అనడం, ఎంపీల సస్సెండ్ డ్రామానే'
Published Wed, Feb 12 2014 7:12 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
న్యూఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనడం, ఎంపీలనూ సస్పెండ్ చేయడం అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆడిస్తున్న డ్రామాలో భాగమని ఏపీఎన్జీవో నేత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే ధృడ సంకల్పం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రానికి తెలంగాణ బిల్లు రాకముందే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసుంటే ప్రయోజనం ఉండేది అని ప్రజలు భావిస్తున్నారని సత్యనారాయణ అన్నారు. విభజన ప్రక్రియ క్లైమాక్స్ చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎంతమంది రాజీనామా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని సత్యనారాయణ అన్నారు.
Advertisement
Advertisement