దాడులు జరిపితే ఉద్యమం మరింత బలోపేతం: సీమాంధ్ర అడ్వొకేట్స్
దాడులు జరిపితే ఉద్యమం మరింత బలోపేతం: సీమాంధ్ర అడ్వొకేట్స్
Published Sun, Aug 25 2013 5:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
తెలంగాణ న్యాయవాదుల తీరును ఖండిస్తున్నామని సీమాంధ్ర అడ్వొకేట్స్ అన్నారు. మా ఆఫీసులో తెలంగాణ లాయర్లు దౌర్జన్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కలిసుండగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక విడిపోతే ఎలాంటి స్థితి వస్తుందోనని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని..అయితే తాము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమను అడ్డుకుంటే, తమపై దాడి చేస్తే సమైక్య ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని..ఇప్పటికే ఈ ఘటన తర్వాత చాలామంది ఫోన్ చేశారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో కోటి మందితో తాము సభ పెట్టుకోవడానికి సిద్దమని ఆయన అన్నారు. కొందరు కిరాయి రౌడీలతో దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు. తాము తిట్టినా, కొట్టినా తాము పడేందుకు సిద్దంగా ఉన్నామని.. ఎందుకంటే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే తెలంగాణ దూరమవుతుందని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement