Telangana advocates jac
-
ప్రభుత్వ నియంతృత్వంతోనే కోర్టుకు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ, చట్ట వ్యతిరేక విధానాలపై కోర్టుకు వెళ్లకతప్పడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఏర్పాటు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజానుకూలంగా, రాజ్యాంగానికి లోబడి పాలన ఉంటే కోర్టులో పోరాడాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుందన్నారు. అన్ని శాఖల్లోనూ జేఏసీలు ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. న్యాయ, చట్ట, రాజ్యాంగపరమైన అంశాలపై అడ్వొకేట్లకు ఉన్న అవగాహన మరెవరికీ ఉండదన్నారు. తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలి తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. దీంతోపాటు సీఆర్పీసీ 41ని రద్దు చేయాలని, న్యాయశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగానే అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్లుగా గోపాలశర్మ, కొండారెడ్డి, మల్లేశ్ ఎన్నికయ్యారు. కో కన్వీనర్లుగా మహమూద్, హస్మ రహీమా, బాబురావు, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, ప్రసాద్ బాబు, ఉదయగిరి, వెంకటేశ్ యాదవ్, భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ
పోలీసులకు తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి కూడా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నాయకులు శుక్రవారమిక్కడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై నేర పూరితమైన కుట్ర(సెక్షన్ 120బీ), హత్యాయత్నం(307) కింద కేసు నమోదు చేయాలని వారు కోరారు. సిక్కుల ఆగ్రహానికి బలైన ఇందిరాగాంధీ, శ్రీలంక తమిళుల ఆగ్రహానికి ప్రాణాలు కోల్పోయిన రాజీవ్‌గాంధీకి పట్టిన గతే సోనియాగాంధీకి పడుతుందని అనడం ద్వారా అన్యాపదేశంగా ఆమె హత్యకు గురవుతారని చంద్రబాబు హెచ్చరించడం దారుణమని అన్నారు. ఇంతటి దారుణ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై తక్షణం కేసు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. వెయ్యిమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు. కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణను ఆపాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. -
కిరాయి రౌడీలతో దాడి: అశోక్ బాబు
-
దాడులు జరిపితే ఉద్యమం మరింత బలోపేతం: సీమాంధ్ర అడ్వొకేట్స్
తెలంగాణ న్యాయవాదుల తీరును ఖండిస్తున్నామని సీమాంధ్ర అడ్వొకేట్స్ అన్నారు. మా ఆఫీసులో తెలంగాణ లాయర్లు దౌర్జన్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కలిసుండగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక విడిపోతే ఎలాంటి స్థితి వస్తుందోనని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని..అయితే తాము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమను అడ్డుకుంటే, తమపై దాడి చేస్తే సమైక్య ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని..ఇప్పటికే ఈ ఘటన తర్వాత చాలామంది ఫోన్ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కోటి మందితో తాము సభ పెట్టుకోవడానికి సిద్దమని ఆయన అన్నారు. కొందరు కిరాయి రౌడీలతో దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు. తాము తిట్టినా, కొట్టినా తాము పడేందుకు సిద్దంగా ఉన్నామని.. ఎందుకంటే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే తెలంగాణ దూరమవుతుందని ఆయన హెచ్చరించారు. -
సీఎం కిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ సమావేశం సమయంలో తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించి ఆనక సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటన వచ్చిన అనంతరం ఏడు రోజులు చీకటి గదుల్లో కూర్చు న్న సీఎం కుట్రలు పన్ని సమైక్యవాద కృత్రిమ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో చెప్పిన సమస్యలన్నీ ఆయనకు గతంలో తెలియ దా? అని వారు ప్రశ్నించారు. సోనియా భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆమె ఇచ్చిన మాటనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.