Seemandhra Advocates JAC
-
సమైక్య సభకు సీమాంధ్ర లాయర్ల మద్దతు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే నెల 7న హైదరాబాద్‌లో జరిగే సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య సభకు హైకోర్టు, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, ఏపీఏటీల సీమాంధ్ర న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించాలని తీర్మానించారు. గత వారం సీమాంధ్ర న్యాయవాదులు నిర్వహించిన సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదులు అడ్డుకొని, దాడులకు పాల్పడటాన్ని ఖండించారు. గురువారం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులు గురువారం సమావేశమయ్యారు. సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కనకమేడల రవీంద్రకుమార్, కాసా జగన్మోహన్రెడ్డి, వై.నాగిరెడ్డి, ఎం.మనోహర్‌రెడ్డి తదితరులతో పాటు సుమారు 250 మంది లాయర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సి.వి.మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీలో ఎవరెవరు ఉండాలో రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. హైదరాబాద్ అందరిదీ అని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరే హక్కు ఎవ్వరికీ లేదని సి.వి.మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అత్యంత హేయమైనదని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. -
ఏపీఎన్జీవో భవన్లో సీమాంధ్ర అడ్వకేట్ల సమావేశం
హైదరాబాద్: సీమాంధ్ర న్యాయవాదులు ఏపీఎన్జీవో భవన్ లో గురువారం సమావేశమైయ్యారు. సెప్టెంబరు 7వ తేదీన హైదరాబాద్ లో చేపట్టనున్న సమైక్యాంధ్ర సభ ఏర్పాటుకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర న్యాయవాదులు ఏపీఎన్జీవో భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం అశోక్ బాబు మాట్లాడుతూ.. చట్టపరంగానైనా సెప్టెంబర్ 7న సభ నిర్వహించి తీరుతామన్నారు.సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులే సభలో పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ పై అందరికీ సమాన హక్కులున్నాయని, సభ ఏర్పాటుకు తెలంగాణ వాదులు సహకరించాలని ఆయన విజ్క్షప్తి చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్ లోల సభ పెడితే తెలంగాణ వాదం దెబ్బతింటుందనే వాదన సరికాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వల్లే మాకు ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీ నామాలు చేస్తే తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్లే అవకాశం లేదని, అలాగని వెనక్కి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యమం వల్ల రాష్ట్రంలో యథాతథస్థితే ఉంటుందని భావిస్తున్నామని అశోక్‌బాబు తెలిపారు. తృణమూల్, సీపీఎం, అన్నాడీఎంకే తెలంగాణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాగా, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయవద్దని మిగిలిన పార్టీలూ కోరుతున్నాయన్నాయని తెలిపారు. -
కిరాయి రౌడీలతో దాడి: అశోక్ బాబు
-
దాడులు జరిపితే ఉద్యమం మరింత బలోపేతం: సీమాంధ్ర అడ్వొకేట్స్
తెలంగాణ న్యాయవాదుల తీరును ఖండిస్తున్నామని సీమాంధ్ర అడ్వొకేట్స్ అన్నారు. మా ఆఫీసులో తెలంగాణ లాయర్లు దౌర్జన్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కలిసుండగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక విడిపోతే ఎలాంటి స్థితి వస్తుందోనని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని..అయితే తాము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమను అడ్డుకుంటే, తమపై దాడి చేస్తే సమైక్య ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని..ఇప్పటికే ఈ ఘటన తర్వాత చాలామంది ఫోన్ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కోటి మందితో తాము సభ పెట్టుకోవడానికి సిద్దమని ఆయన అన్నారు. కొందరు కిరాయి రౌడీలతో దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు. తాము తిట్టినా, కొట్టినా తాము పడేందుకు సిద్దంగా ఉన్నామని.. ఎందుకంటే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే తెలంగాణ దూరమవుతుందని ఆయన హెచ్చరించారు.