ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్‌కో | high court stay on apngo's lands | Sakshi
Sakshi News home page

Jul 7 2014 3:50 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్‌కో విధించింది. విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్‌ 36, 37లలోని 189 ఎకరాలను 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏపి ఎన్జీఓ సోసైటీకి కేటాయించింది. అయితే అప్పటి నుంచి ఇక్కడ నిర్మాణాలు ఏమీ జరగలేదు. ఆ కారణం చూపుతూ ఆ భూమి స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌ ఆర్డీవో సురేష్‌ ఒడ్డార్‌, శేరిలింగంపల్లి తహశీల్దార్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములు అని బోర్డు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ భూములకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు ఉన్నందునే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడరాదని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవోల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములపై హైకోర్టు స్టేటస్కో విధించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement