ఏపీ ఎన్జీఓలు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మళ్లీ మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి ఉద్యోగులు విధులకు హాజరవుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు ముగిసిన అనంతరం ఏపీఎన్జీఓ నేతలు అంతర్గతంగా సమావేశమయ్యారు. సీఎం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఏం చేయాలనే అంశంపై చర్చించారు. కొందరు సమ్మె విరమించాలంటే, మరికొందరు కొనసాగించాలన్నారు. చివరకు తాత్కాలికంగా సమ్మె విరమించాలని నిర్ణయించారు. అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల వరకే సమ్మె విరమణ అని చెప్పారు. సమైక్యవాదానికి తాను కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు జరిగే నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మళ్లీ సమ్మె ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశాలు కొనసాగినన్ని రోజులు తాము సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమ్మె కాలానికి జీతం గురించి తాము చర్చించలేదని అశోక్ బాబు చెప్పారు.
Published Thu, Oct 17 2013 5:19 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement