temporary
-
తాత్కాలికంగా ఖాళీ చేయిస్తామన్నారంతే..
గ్వాటెమాలా సిటీ: గాజా ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మిత్ర దేశాలతోపాటు, సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో, ట్రంప్ యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం ట్రంప్ మాటలకు మరో అర్థం చెప్పారు. గాజా పునర్నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అక్కడున్న 18 లక్షల మంది పాలస్తీనియన్లకు మరో చోట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలన్నదే ట్రంప్ మాటల వెనుక అర్థమంటూ వివరించారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మార్కో రుబియో గురువారం మొట్టమొదటి విదేశీ పర్యటన కోసం గ్వాటెమాలా వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగిన 15 నెలల యుద్ధం ఫలితంగా గాజా ప్రాంతం శిథిలాలతో నిండిపోయింది. వాటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలనే సదుద్దేశంతో ట్రంప్ చాలా జాలితో పాలస్తీనియన్లకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశారు. పునర్నిర్మాణ పనులు జరిపేటప్పుడు అర్థంతరంగా వెళ్లాలన్నా వారు ఎక్కడికీ వెళ్లలేరు, అక్కడే ఉండిపోనూ లేరు’అని చెప్పుకొచ్చారు. లీవిట్ వాషింగ్టన్లో మీడియాతో సమావేశంలో.. గాజాను ధ్వంసమైన ప్రాంతంగా పేర్కొంటూ శిథిల భవనాలతో కూడిన ఫొటోను ప్రదర్శించారు. అధ్యక్షుడు అక్కడి వారిని గాజా నుంచి తాత్కాలికంగా తరలించాలని స్పష్టంగా చెప్పారు. గాజా ప్రస్తుతం మనుషులకు ఏమాత్రం నివాసయోగ్యంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండిపోవాలనడం కూడా దుర్మార్గమైన సూచన అనిపించుకుంటుంది’అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, గాజాకు అమెరికా బలగాలను పంపే యోచనను ఆయన కొట్టిపారేయలేదు. చర్చలు సవ్యంగా సాగాలంటే అమెరికా బలగాలు అక్కడుండాల్సిన అవసరముందని చెప్పారు. గాజా పునర్నిర్మాణానికి ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలతో మిలటరీ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం ప్రకటించారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గ్యుటెరస్ ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెదికే ప్రయత్రంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశి్చమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు.ట్రంప్ ఏమన్నారంటే.. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశి్చమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. -
వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వానాకాలం సీజన్లో పంటలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలు, సిఫార్సుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. వానాకాలం ఊపందుకునేలోగా ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను, మరమ్మతు పనులను శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన మంత్రి.. తొలుత సుందిళ్ల వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని సందర్శించారు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారానికి చేరుకున్నారు. అక్కడి సరస్వతి బ్యారేజీ వద్ద మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. లక్ష్మి బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పియర్లు, మరమ్మతు పనులను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.ఎన్నికల కోడ్ ఉండటంతో ఇన్నిరోజులుగా పనులను ఇంజనీరింగ్ అధికారులే పర్యవేక్షించారని చెప్పారు. ఇకపై మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. తాత్కాలిక మరమ్మతు పనులు అన్నారంలో 60శాతం మేర, మేడిగడ్డ వద్ద 80శాతం మేర పూర్తి కావొచ్చాయన్నారు. సుందిళ్లలో నత్తనడకన సాగుతున్న పనుల విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు.బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందే..గత ప్రభుత్వం రూ.94 వేల కోట్ల ఖర్చు చేస్తే.. కేవలం లక్ష ఎకరాల ఆయకట్టు తయారైందని.. అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. మా ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై డ్యాం సేఫ్టీ అధికారులను సంప్రదించాం. వారు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. బ్యారేజీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మూడు బ్యారేజీలను గేట్లు ఎత్తి ఉంచాలని, అలా ఉంచితే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లదని చెప్పారు.ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం..’’ అని తెలిపారు. బ్యారేజీల కుంగుబాటుపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని.. ఆ రిపోర్ట్ ప్రకారం మాజీ ఇరిగేషన్ చీఫ్‌ను విధుల నుంచి తప్పించామని వివరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సీరియస్‌గా ఏ ఒక్క పనీ చేయలేదని ఉత్తమ్ విమర్శించారు.తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాంఅసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేసిన డీపీఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగులోకి వచ్చే ప్రాజెక్టులను త్వరగా చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్, ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.జియోట్యూబ్‌లతో నీటిని ఆపి, ఎత్తిపోయొచ్చు!తాత్కాలిక మరమ్మతు పనులు మేడిగడ్డ, అన్నారంలలో వేగంగా నడుస్తున్నాయని, సుందిళ్లలో కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద 5 మీటర్లలో ఎత్తులో జియోట్యూబ్‌లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. అదే అన్నారంలో 11 మీటర్ల ఎత్తులో, సుందిళ్లలో 9 మీటర్ల ఎత్తులో ఆపితే నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. -
ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. ► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది. గత 4 ఏళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే. కొత్త లాంచింగ్లొద్దు.. ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను లాంచింగ్ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి. కొనేముందు జాగ్రత్తలివే.. ► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్. ► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించాలి. ► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం. ► అన్ని అనుమతులతో పాటు మార్కెట్లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే.. ► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి. ► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బేరసారాలకు ఇదే సమయం భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. హైదరాబాద్ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్ ఒక మెట్టు దిగే ఛాన్స్ ఉంటుంది. -
రాజన్న సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ బంద్
-
కెనడా వెళ్లే విద్యార్థులకు మరో షాక్! ఇకపై అలా కుదరకపోవచ్చు..
కెనడా వెళ్లే విద్యార్థులకు ఆ దేశం మరో షాక్ ఇవ్వబోతోంది. 2024 ఆ తర్వాత దేశంలోకి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై పరిమితులు విధించే అవకాశం ఉందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల భారీ ప్రవాహాన్ని పరిష్కరించడానికి వచ్చే ఏడాది ప్రారంభంలో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కెనడాలో తలెత్తిన హౌసింగ్ సంక్షోభానికి విదేశీ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడానికి మధ్య సంబంధం ఉందని మిల్లర్ అభిపాయపడ్డారు. తాత్కాలిక ప్రాతిపదికన కెనడాలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఆకాశాన్ని తాకిందన్నారు. అయితే తాను నిర్దిష్టంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పారు. విద్యార్థుల రూపంలో.. దేశంలో చాలా కాలంగా అస్థిరంగా ఉన్న తాత్కాలిక విదేశీ కార్మిక వ్యవస్థ వల్ల తలెత్తుతున్న పరిణామాలపై తాను దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మిల్లర్ పేర్కొన్నారు. తాత్కాలిక వ్యవసాయ కార్మికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లను పొందిన అంతర్జాతీయ విద్యార్థుల రూపంలో తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా కెనడాలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 మూడో త్రైమాసికంలో ఆ దేశ జనాభా 4.3 లక్షలకుపైగా పెరిగిందని స్టాటిస్టిక్స్ కెనడా తన ఇటీవలి డేటాలో పేర్కొంది. ఇది వెల్లడైన వారం రోజుల్లోనే మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో 1957 తర్వాత ఓ త్రైమాసికంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు ఇదే. ఈ నివేదిక ప్రకారం.. కెనడాలో ప్రస్తుతం 4 కోట్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3.13 లక్షల మంది వలసదారులు ఉండటం గమనార్హం. కాగా విదేశీ విద్యార్థుల పట్ల కెనడా ప్రభుత్వం ఇదివరకే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. 2024 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. -
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు. ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. -
ఈనెల 23 వరకు జీవో నెం.1 పై హైకోర్టు తాత్కాలిక స్టే
-
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
యుద్దానికి బ్రేక్ ఇచ్చిన రష్యా..
-
విధి వంచితుడు..!
సాక్షి, నల్లగొండ: కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉపాధి కోసం వెళ్తే.. అతనికి శాశ్వత వైకల్యం మిగిలింది. తలరాతో.. లేక విధి వెక్కిరించిందో.. కానీ అతని కుటుంబంలో మాత్రం తీరని విషాదం నింపింది. తన పిల్లలను ఎత్తుకుని ఆడుతూ పాడుతూ వారిని లాలించాలి్సన తండ్రి ఇప్పుడు వాకర్ సాయం లేనిదే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి దాపురించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక కండక్టర్‌గా పనిచేస్తున్న అతడిని తాను డ్యూటీ చేస్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో కాలు నుజ్జునుజ్జయింది. మోకాలి కింది వరకు కాలు తొలగించారు. 23 రోజులు అతనితో పని చేయించుకున్న ఆర్టీసీ సంస్థ అతన్ని పట్టించుకున్న పాపానపోలేదు. బస్టాండ్‌లో ఘటన జరిగినా కనీసం మందలించిన వారు కూడా లేరు. దీంతో తనను ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్‌లో ఇన్చార్జ్ కలెక్టర్ ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన పురం జానయ్య. వైద్యానికి రూ.4.70 లక్షల ఖర్చు.. జానయ్య పొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక కార్మికులు కావాలని పత్రికల్లో ప్రకటించడంతో మిర్యాలగూడ డిపోలో దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్‌గా ఎంపికై 23 రోజుల పాటు విధులు నిర్వర్తించాడు. మిర్యాలగూడ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో జానయ్య ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి మొదట పాదం వరకు పూర్తిగా తొలగించారు. తరువాత కూడా కాలుకు గాయాలు ఏ మాత్రం మానకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేసి మోకాలి కింది భాగం వరకు తొలగించారు. ఇలా రెండుసార్లు ఆపరేషన్ చేయడంతో రూ.4.70 లక్షల ఖర్చు అయింది. రెక్కాడితేగానీ డొక్క నిండని ఆ కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర అప్పు తెచ్చి.. వైద్యం చేయించారు. నయా పైసా ఇవ్వని ఆర్టీసీ... జానయ్య చేత 23 రోజులు పని చేయించుకుని ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నా.. ఆ సంస్థ అధికారులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. జానయ్య భార్య స్వాతి వీబీకేగా పని చేస్తే నెలకు రూ.3 వేలు మాత్రమే వస్తున్నాయి. ఆ మొత్తంతో కుటుంబ పోషణకు కూడా భారంగా మారిందని బాధితుడు కన్నీరుమన్నీరవుతున్నాడు. డిగ్రీ వరకు చదివిన తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకున్నాడు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన పురం జానయ్య -
మా పొట్ట కొట్టకండి..
సాక్షి, హైదరాబాద్: ‘మా పొట్టలు కొట్టకండి.. ప్రజల ప్రాణాలు తీయకండి’ అంటూ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తాత్కాలిక డ్రైవర్ల చేతికి గులాబీ పూలు ఇచ్చి మరీ వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద మంగళవారం కార్మికులు, వారి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని డిపోల నుంచి బస్సులు తీస్తున్న తాత్కాలిక బస్సు డ్రైవర్లను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల వారి కాళ్లకు దండం పెట్టి మరీ వేడుకోవటం కని పించింది. రాష్ట్ర బంద్ తర్వాత మలిదశ సమ్మె కార్యాచరణలో భాగంగా.. తాత్కాలిక సిబ్బందిని కుటుంబ సభ్యులతో కలసి విన్నవించే కార్యక్రమా న్ని మంగళవారం ఏర్పాటు చేశారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులను చూస్తేనే ప్రజలు వణుకుతున్న పరిస్థితి నెలకొందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు విధులు నిర్వర్తించకుంటే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందని, 49 వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటుందని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని కోరారు. సమ్మె పరిష్కారమైన తర్వాత తాత్కాలిక డ్రైవర్లకు ఎలాగూ ఉద్యోగం ఉండదని, దీన్ని గుర్తించి వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. ఖమ్మం డిపో ఎదుట కార్మికులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రోడ్డుపై పడుకుని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. నల్ల గొండ డిపో వద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టు కుని నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో ఈ డిపో పరిధిలో 45 అద్దె బస్సులు రోడ్డెక్కలేదు. సిద్దిపేటలో 40 అద్దె బస్సులకు ఒకే బస్సు నడిచింది. సంగారెడ్డిలో అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెకు సంఘీభావం తెలిపారు. మహబూబ్‌నగర్‌లో కార్మికుల ఆందోళనల్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. 18వ రోజు ఉధృతంగా.. 18వ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఉధృతంగా సమ్మెలో ముందుకు సాగారు. జూబ్లీబస్టాండ్ వద్ద రోడ్డుపై భారీ ఎత్తున వంటావార్పు నిర్వహించారు. దాదాపు 2 వేల మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డుమీదనే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భోజనాలు చేశారు. అనంతరం సభ నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కోదండరాం, కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, వీహెచ్, టీడీపి అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహు లు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తప్పుడు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. వంద శాతం బస్సులు నడుపుతున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం అశ్చర్యంగా ఉందన్నారు. జేబీఎస్ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి, చిత్రంలో వివిధ పార్టీల నేతలు -
తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1,500, కండక్టర్‌కు రూ.వెయ్యి
సాక్షి, మహబూబ్‌నగర్: ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని ఇన్చార్జ్ డీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సమ్మె చేస్తున్న కాలంలో స్కూల్ బస్సులు నడపాలని దీని కోసం రోజు రూ.100 ట్యాక్స్ చెల్లించడంతోపాటు వారానికి రూ.200 ఫీజు చెల్లించి ఉమ్మడి జిల్లాలో ఏ రూట్లో అయిన బస్సులు నడుపుకొనే అవకాశం కల్పించామన్నారు. స్కూల్ బస్సులతోపాటు ప్రైవేట్ బస్సులు సైతం నడుపుకోవడానికి అనుమతి ఇస్తున్నామని, ప్రైవేట్ బస్సులు అయితే హైదరాబాద్, కర్నూలు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లవచ్చన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు నడపడానికి హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏడాదిన్నర వాహనం నడిపిన అనుభవం కలిగిన వారిని తాత్కాలిక డ్రైవర్లుగా, పదో తరగతి చదివిన వారిని కండక్టర్లుగా తాత్కాలికంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో రోజుకు డ్రైవర్‌కు రూ.1,500, కండక్టర్‌కు రూ.వెయ్యి వేతనం చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్టాండ్‌లో కానీ ఆర్టీఓ కార్యాలయంలో కాని సంప్రదించాలన్నారు. కండక్టర్లు వచ్చేటప్పుడు పదో తరగతి జిరాక్స్ మెమో, డ్రైవర్లు హెవీ లైసెన్స్ తీసుకురావాలన్నారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉపసంహరించుకుంటే పాత పద్ధతిలోనే బస్సులు నడుస్తాయన్నారు. -
సమయం ఒక్కరోజు మాత్రమే...
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్ఏల పదోన్నతుల ప్రక్రియపై కస రత్తు ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం పదో న్నతులు ఇచ్చినా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా మరో కొత్త కోణానికి తెరతీశారు. వీఆర్ఏల తాత్కాలిక జాబితాను రూపొందించి ఒక్కరోజు సమయమిస్తూ పరిశీలన కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పంపారు. తాజాగా 436 మందితో మెరిట్ ప్రకారం ఫైనల్ సీనియారిటీ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసిన అధికారులు తహసీల్దార్ల నుండి నివేదిక కోరారు. ఈనెల 21న అంటే గురువారం జాబితాను తహసీల్దార్లకు పంపి శుక్రవారమే నివేదిక పంపించాలని సూచించారు. ఒక్కరోజే సమయం ఇవ్వడంతో ఒకరు, ఇద్దరు తప్ప మిగతా వారెవరూ నివేదికను కలెక్టర్‌కు పంపించలేదు. భూప్రక్షాళన కార్యక్రమంలో బిజీగా ఉన్న తహసీల్దార్లు పరిశీలన నివేదికను ఒక్కరోజులో కావాలని ఆదేశించడంపై పెదవి విరుస్తున్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఢిల్లీ నుండి రాకముందే ఈ ప్రక్రియను ముగించాలన్న ఉద్దేశంతో ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 13న ఉమ్మడి జిల్లాలో 80 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన కలెక్టర్ జాబితా పునఃపరిశీలనకు ఆదేశించా రు. జాబితాను మూడు రోజులు పరిశీలించగా అక్రమాలు వాస్తవమని తేలడంతో తాజాగా మరోసారి తాత్కాలిక జాబితా రూపొందించారు. ఆయన అనుకున్నదే చేస్తారా.. కలెక్టరేట్లో తనదైన ముద్ర వేసుకున్న కీలక అధి కారి తాను చెప్పిందే వేదంగా ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలు బయటపడడంతో తన చేతికి మట్టి అంటకుండా కింది స్థాయి సిబ్బందిపై నెడుతున్నట్లు సమాచారం. తప్పుడు వివరాలు పొందుపరిచి ఏకంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించారంటే ఆయన పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ లేని సమయంలో పరిశీలన నివేదికల కోసం ఆదేశించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాను అనుకున్నదే చేసి తీరాలని, తనను వ్య తిరేకిస్తున్న వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 15రోజుల సమయం ఇవ్వాలి వీఆర్ఏల పదోన్నతుల్లో మరోసారి తప్పిదాలు చేస్తే ఆందోళనలు తప్పవని డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుగౌడ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక జాబితాను రూపొందించిన కలెక్టరేట్ అధికారులు పరిశీలన నివేదిక కోసం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఒక్క రోజు సమయమివ్వడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో పదోన్నతుల జాబితాపై పునపరిశీలన జరిగిందని, అక్రమాలు జరిగాయని స్ఫష్టం కావడంతో మరోసారి తాత్కాలిక జాబితాను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు పరిశీలనకు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈ నెల 21 నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల సీనియారిటీ, ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏలందరినీ తాత్కాలిక జాబితాలో చేర్చాలని, ఆ జాబితాను నోటీసు బోర్డుపై పబ్లిష్ చేయాలని, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. -
డీమానిటైజేషన్: రాష్ట్రపతి హెచ్చరిక
న్యూడిల్లీ: డీమానిటైజేషన్ పై దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్రపతి పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అయితే సుదీర్గ ఫలితాలు కోసం ఈ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ భేటీలో పాల్గొన్న ప్రణబ్.. డిమానిటైజేషన్ కారణంగా పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూడాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పేదరికం నిర్మూలనలో కోసం చేపట్టిన ఈ ప్రక్రియను ప్రశంసిస్తూనే..నోట్ల కష్టాలను సుదీర్ఘంకాలం భరించలేరని భావిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఇతర యంత్రాంగం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి అవసరం ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలనలో జాతికోసం జరుగుతున్న పయనంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘ ఫలితాలు సాధించాలంటే తాత్కాలికంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడక తప్పదని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. -
చెన్నైఎయిర్ పోర్ట్ మూసివేత
-
ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికమే
పునర్విభజన సమావేశంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పునర్విభజనలో కొత్త జిల్లాకు అధికారులు, సిబ్బందిని తాత్కాలికంగానే కేటాయించనున్నామని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పునర్విభజన పర్యవేక్షక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాకు కేటాయింపులు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరపాలని సూచించారు. ఆయా శాఖలు తమ తమ జాబితాను ఇష్ట ప్రకారంగా సమర్పించినందున అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. నమూనాలో కార్యాలయ వసతి, సిబ్బంది, ఫైళ్ల వివరాలు, ఫర్నిచర్ సంబంధిత వివరాలు అందించాలని కోరారు. ఫైళ్ల నమూనాలో గార్ల, బయ్యారానికి సంబంధించిన ఫైళ్లు ఉంటే వాటిని వేరుగా చూపించాలని చెప్పారు. అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని, అక్కడ ఏ నమూనాలో అడిగినా పంపించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన జాబితాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, సీపీఓ రాందాస్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, సమాచార శాఖ ఏడీ ముర్తుజా, మెప్మా పీడీ వేణుమనోహర్‌రావు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణ పనుల్లో అపశ్రుతి
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిషన్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన వెలగపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ కాంక్రీట్ మిషన్‌లో పడి మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. -
గర్భిణీ ఛాతీలోకి చొచ్చుకెళ్లిన ఇనుపరాడ్
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అపారం
కేంద్రానికి నివేదిస్తాం పార్లమెంటరీ కమిటీ బృందం వెల్లడి అనకాపల్లి: హుద్‌హుద్ తుపానుకు జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు స్పష్టంగా కన్పిస్తోందని పార్లమెంటరీ కమిటీ పరిశీలన బృందం చైర్మన్ భట్టాచార్య తెలిపారు. భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్యపాల్ సింగ్‌తో పాటు పలువురు ఎంపీలు అనకాపల్లిలోని తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. భట్టాచార్య మాట్లాడుతూ నష్టం అపారమని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వేగవంతం చేయాలని, ఇటువంటి అంశాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.ఎంపీ సీతారామ ఏచూరి మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించే ఇళ్ల కంటే పక్కా ఇళ్లు నిర్మించడమే మేలన్నారు. జరిగిన నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు, జిల్లా కలెక్టర్ యువరాజ్, డీఆర్డీఏ పీడీ వెంకటరెడ్డి, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యుడు పల్లెల గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏఎంఏఎల్ కళాశాలలో... ఏఎంఏఎల్ కళాశాలలో తుఫాన్‌కు పడిపోయిన ఆడిటోరియం, ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం సభ్యులు తిలకించారు. అక్కడ జరిగిన న ష్టాన్ని వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ వివరించారు. ఇంత వరకూ ప్రజాప్రతినిధులు రాలేదని లక్ష్మీనారాయణ చెబుతుండగా, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకొని తమ నివేదిక వల్లే ఈ బృందం వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామంతి పెరగడంతో కలెక్టర్ సర్దిచెప్పారు. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బృందం.. అనంతరం పార్లమెంటరీ బృందం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలకు ఆలయ వర్గాలు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం రాంబిల్లి: హుద్‌హుద్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ పరిశీలన బృందం చైర్మన్ పి. భట్టాచార్య హామీ ఇచ్చారు. ఆదివారం భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్య పాల్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు రాంబిల్లి మండలం గొరపూడిలో హుద్‌హుద్ తుపాను ధాటికి నేలకూలిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఎంపీపీ వసంతవాడ లక్ష్మీనాగరత్నం, పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ఉద్యానవన శాఖ అధికారి రాధిక తుపాను నష్టం తీరును ఎంపీలకు వివరించారు. పర్యటనలో బృంద సభ్యుల వెంట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంపీడీవో డి.డి. స్వరూపరాణి, టీడీపీ నాయకులు లాలం భాస్కరరావు, లాలం నాయుడుబాబు, వసంతవాడ దిన్‌బాబు పలు శాఖల అధికారులు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. -
తాత్కాలిక కేటాయింపులే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాము చేసే తాత్కాలిక కేటాయింపుల మేరకు ఇరు ప్రాంత ఉద్యోగులు పని చేయాల్సిందేనని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఆప్షన్లు ఇవ్వాలన్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలకు గానీ.., స్థానికత, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకుగానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్థానికత ఆధారంగా చేస్తామని చెబుతున్నా.. రెండు రాష్ట్రాల్లో పరిపాలన అవసరాల దృష్ట్యా పని చేస్తున్న వారినే విభజించాల్సి వస్తోందని సీఎస్ పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేశామని చెబుతూ సమావేశాన్ని ముగించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలో పడ్డాయి. సమావేశం నుంచి బయటకు వస్తూనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కడి వారు అక్కడే పనిచేసేలా చర్యలు చేపట్టాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. పని చేస్తున్న ఉద్యోగుల ఆధారంగానే: సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాల్లో మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను 58.32 : 41.68 నిష్పత్తిలో విభజించనున్నారు. ఈ మేరకు జూన్ 1న ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో కొందరు కొందరు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది. మరో మూడు నెలల్లో శాశ్వత కేటాయింపులు ఉంటాయని, అంతవరకు ఈ కేటాయింపులు వర్తిస్తాయని సీఎస్ స్పష్టంచేశారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల విషయంలో ఎక్కడివారిని అక్కడే పనిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణకు నోచుకుంటుందోనని సంఘాల నేతలే చెబుతున్నారు. రెండు ప్రభుత్వాలు కొలువుదీరాక కేంద్రం ఏర్పాటు చేసే సమన్వయ కమిటీ ప్రత్యేకంగా గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ సెల్ ఉద్యోగుల సమస్యలను పరిశీలించి న్యాయం చేస్తుందని హామీనిచ్చింది. కేటాయింపులపై అభ్యంతరాలు ఉంటే జూన్ 9లోపు తెలపాలని పేర్కొంది. కాగా, జూన్ 1 తేదీనే తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వెలువడనున్నాయని తెలిసింది. సీఎస్‌తో జరిగిన భేటీలో టీఎన్జీవో, టీజీవో, ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకత లేదు: దేవీప్రసాద్ ఉద్యోగుల విభజనలో పారదర్శకత లేదని, ఎంతమంది ఉద్యోగులు ఎటు వెళ్తున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. కేంద్రం సరైన సమయంలో మార్గదర్శకాలను ఇవ్వలేదని, పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా విభజన చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. చాలా మంది సీమాంధ్ర ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని, కమలనాథన్ కమిటీకి ఈ వివరాలు అందజేశామని చెప్పారు. జూన్ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణకు ఒకటిన్నర రోజు వేతనం.. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ ఒకటిన్నర రోజు వేతనాన్ని (దాదాపు రూ.60 కోట్లు) విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో ఒకరోజు వేతనం తెలంగాణ ప్రభుత్వానికి (ముఖ్యమంత్రి సహాయ నిధికి), సగం రోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవీ ప్రసాద్ తెలిపారు. మళ్లీ తీసుకువస్తాం: శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ ఉద్యోగులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాల్సి వచ్చినా వారిని మళ్లీ తెలంగాణకు తీసుకువస్తామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం వ్యవస్థాక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సీమాంధ్రులు కూడా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని అక్కడికి పంపించాలని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలన్నారు. ముందుగా ఇవ్వాల్సింది: విఠల్ కేంద్ర మార్గదర్శకాలను ముందుగా ఇస్తే ఇంత గందరగోళం ఉండేది కాదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది సీమాంధ్రులు ఇక్కడే ఉండే పరిస్థితి వచ్చిం దన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో పనిచేయడానికి సిద్ధంగా లేనని చెప్పారు. స్థానికేతరుల్లో వేల మంది టీచర్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన వేల మంది టీచర్లు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉన్నారని పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే స్థానికేతరులు 50 శాతానికిపైగా ఉన్నారన్నారు. -
ఇది తాత్కాలిక ఉద్యోగ విభజన మాత్రమే!
-
ఏపీఎన్జీఓల సమ్మె తాత్కాలిక విరమణ
-
తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నవారికి తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పౌర సరఫరాలశాఖ అధికారులు రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించారు. గ్రేటర్ మొత్తం మీద తెల్లరేషన్ కార్డుల కోసం సుమారు రెండున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వాటిలో సుమారు లక్ష మందిని అర్హులుగా అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. వీటిలో హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 58 వేల వరకు మంజూరు కానున్నాయి. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరనుంది. తెల్లకార్డుల ఘనత వైఎస్సార్‌దే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాకముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెల్లరేషన్ కార్డులు ఆరు లక్షలు కూడా లేవు. ఆయన సీఎంగా వచ్చాక నిరుపేదలందరికి తెల్ల రేషన్‌కార్డులు వర్తింపజేయడంతో ఆ సంఖ్య రెండింతలకు పెరిగింది. కొత్త కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాల వల్ల కొందరు అనర్హులు కార్డులు పొందారు. దీంతో కొన్నింటిని రద్దు చేశారు. అంతకుముందే కొందరిని అర్హులుగా తేల్చినా 2009 ఎన్నికల నియమావళి కారణంగా కొత్త తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయలేదు. అయితే, వీరికి నెలవారి సరుకులు పొందేందుకు తాత్కాలిక కూపన్లను ఇచ్చారు. అనంతరం 2010 జనవరి నుంచి 2011 ఫిబ్రవరి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తెల్లరేషన్ కార్డుల అర్హులను ఎంపిక చేశారు. అయినా, వీరికి రేషన్ కార్డులు జారీ చేయలేదు. 2011 నవంబరులో నిర్వహించిన రెండో దశ రచ్చబండలో ఆరు నెలలకు సరిపోయేలా తాత్కాలిక కూపన్లు జారీ చేసి అప్పటి నుంచి 2013 మార్చి వరకు కూపన్ల విధానాన్ని పొడిగిస్తూ వచ్చారు. కార్డుల పంపిణీకి ఇప్పటికే ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో రెండు జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. అయితే, పంపిణీకి అధికారికంగా అదేశాలు అందాల్సి ఉంది.