'రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుంది' | We are influenced by government,says ashok babu | Sakshi
Sakshi News home page

'రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుంది'

Published Sun, Dec 22 2013 11:35 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

'రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుంది' - Sakshi

'రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుంది'

ఎపీఎన్జీవోలను చీల్చారన్నది దుష్ప్రచారం మాత్రమేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంలోని నేతలు భావించడం లేదని అన్నారు. గతంలో ఏపీఎన్జీవోలు వల్ల ప్రభుత్వాలు తారుమారైన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎన్జీవోల రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఆదివారం ఆయన ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా మరోసారి నామినేషన్ దాఖలు చేశారు.

 

గతంలో జరగాల్సిన ఎన్నికలను ఇప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు. తమపై రెండో ప్యానెల్ పోటీ చేసిన విజయం మాత్రం తమదేనని అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బషిర్పై అశోక్ బాబు తలపడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement