సెప్టెంబర్ రెండో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఏపీ ఎన్జీవోలు నోటీసు ఇవ్వడంపై టీఎన్జీవోలు మండిపడుతున్నారు. అసలు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు సమ్మె నోటీసు ఇచ్చే హక్కు లేదని చెబుతున్నారు. అశోక్‌బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను సర్వీస్ నుంచి బర్తరఫ్ చేయాలని టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ డిమాండు చేసింది.
ఈ మేరకు టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీఎన్‌జీవో సమ్మె నోటీసుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
మరోవైపు, సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నరేందర్ ఖండించారు. అసలు రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణకు లాభమేంటని ఆయన ప్రశ్నించారు.
నోటిసిచ్చే హక్కు అశోక్బాబుకు లేదు: టీఎన్జీవో
Published Wed, Aug 21 2013 5:19 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement