గుంటూరు: జిల్లాలోని అమృతలూరు మండలంలో ఏపీఎన్జీవోలు, విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ సమైక్యాంధ్రా గళం కలుపుతున్నారు. తెనాలిలో సమైక్యాంధ్రాకు మద్దతుగా ప్రైవేటు విద్యా సంస్థల బాలికల సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. కాలువలో కార్తీక దీపాలను వదులుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు.
వారం రోజులలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. నిన్నటి వరకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మంత్రులు కూడా ఈరోజు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గమనార్హం.