జీవో 177 రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: జీవో 177 రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీకి నివేదిక తయారు చేసే అంశంపై సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సమావేశమైనట్లు తెలిపారు.
జూలై 1 వ తేదీ నుంచి మధ్యంతరం భృతి కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సమ్మెకాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలన్నారు.