వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు, ఏపీఎన్జీవోలు! | APNGO Leaders met YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు, ఏపీఎన్జీవోలు!

Published Sun, Apr 6 2014 11:15 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు, ఏపీఎన్జీవోలు! - Sakshi

వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు, ఏపీఎన్జీవోలు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు కలిశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీఎన్జీవో నేత పి. అశోక్ బాబుతోపాటు ఇతర నేతలు కలిశారు. ఏపీఎన్జీఓ ప్రతిపాదనలను వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చేర్చాలని వైఎస్ జగన్ కు అశోక్ బాబు, ఇతర నేతలు విజ్క్షప్తి చేశారు. ఏపీఎన్జీఓ నేతలు చేసిన విజ్క్షప్తికి వైఎస్ జగన్  సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. 
 
వైఎస్ జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత అశోక్ బాబు లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులేనని ఆయన అన్నారు. సీమాంధ్ర అభివృద్దిలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించనున్నారని అశోక్ బాబు తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని పలు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రతిపాదనలు మ్యానిఫెస్టోలో పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నామన్నారు. అంతేకాని సీట్లకోసం మాత్రం కాదు అని అశోక్ బాబు స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement