
‘అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలి’
కల్లూరు రూరల్, : ఉద్యోగులను తప్పుదోవ పట్టించిన ఏపీ ఎన్జీవోల చైర్మన్ అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు.
బుధవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సరళగంగ, డబ్ల్యు. వెంకటరమణ మాట్లాడుతూ.. అశోక్‌బాబు సమైక్యం కోసం పోరాడుతున్నట్లు ఎన్జీవోలతో సమ్మె చేయించి నమ్మక ద్రోహం చేశారన్నారు. మోసపూరితంగా 60 రోజుల సమ్మె చేసిన కారణంగా ఏప్రిల్‌లో రిటైర్మెంట్ అవుతున్న ఓ ఉద్యోగి 1.50 లక్షల బెనిఫిట్స్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు సత్యనారాయణరాజు, మరికొందరు ఎన్జీవోలు పాల్గొన్నారు.