
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా అవతరిస్తున్నందున తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.