సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేపట్టిన సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ, మరోవైపు సమ్మెను సమర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో హైకో ర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు ఇవ్వనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు దిగారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే.