స్తంభించిన పాలన
Published Sun, Oct 6 2013 3:04 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
ఏలూరు , న్యూస్‌లైన్ :టీ నోట్ ప్రకంపనలపై జిల్లా వ్యాప్తంగా రెండో రోజున చేపట్టిన ఎన్జీవోల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ కార్యాలయాలన్నింటినీ ఎన్జీవోలు మూ యించి వేయడంతో పాలన స్తంభించింది. సిని మా థియేటర్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలను సమైక్యవాదులు మూయించి వేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులను, గ్రామాల్లోని రహదారులను దిగ్బంధించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్జీవోలు నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. దీంతో ఉద్యోగులు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
ఉద్యోగులను ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ఏలూరు ఆశ్రం వద్ద జాతీయర హదారిని, కలపర్రు టోల్‌గేట్ వద్ద రహదారిని ఎన్జీవోలు దిగ్బంధించారు. ఆచంట సెంటరులో మర్చంట్స్ చాంబర్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కొవ్వూరులో ఎన్జీవోలు రోడ్డు కం రైలు వంతెన దిగ్బం ధించారు. ఎన్‌జీవోలపై అక్రమంగా చేయి చేసుకున్న కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ కుమారులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. నిడదవోలు-పంగిడి రహదారిపై బ్రాహ్మణగూడెం, ఎస్.ముప్పవరం గ్రామా ల్లో సమైక్యవాదులు రోడ్లను చుట్టుముట్టారు. రోడ్డుపై టెంట్లు వేసి నిరసన తెలిపారు. చింతలపూడిలో ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం కొత్తబస్టాండ్ సెంటర్‌లో ఆందోళన చేశారు.
కోయగూడెం యువకులు యువగర్జన నిర్వహించారు. తాడేపల్లిగూడెం లో ఎన్జీవోలు ఎరువుల, ఉల్లిపాయల ఎగుమతి, దిగుమతులను అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఉండిలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఆధ్వర్యం లో వంటావార్పు నిర్వహించారు. నిడదవోలులో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు టీ నోట్ పత్రాలను దహనం చేశారు. ఇరగవరం మం డలం రేలంగిలో గ్రామ పంచాయతీ ఉప సర్పం చ్ వడ్డి మార్కండేయులు, న్యాయవాది గాజుల అప్పాజీ ఆమరణ నిరాహారదీక్షలను ప్రారంభిం చారు. తాడేపల్లిగూడెంలో ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్డుపై టెంట్లు వేసి వంటావార్పు చేశారు. రాజస్తాన్ యువత బంద్‌కు సంఘీభా వం తెలిపింది. భీమవరంలో ఉపాయులు, ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నర్సాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు.
తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకోవాలి
యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, హోం మంత్రి షిండే తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవాలం టూ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఎన్‌జీవోల ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎం పీలు, మంత్రులు, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు పిండప్రదానం చేశారు. భీమవరంలో ప్రకాశం సెంటర్‌లో సెయింట్ జోన్స్ స్కూల్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్, షిండే మాస్క్‌లతో రాక్షస వేషధారణలతో నిరసన తెలిపారు. దెందులూరు, గోపన్నపాలెం, శ్రీరామవరం గ్రామాల్లో సమైక్యవాదులు షిండే, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, శ వయాత్ర నిర్వహించారు.
Advertisement
Advertisement