రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు మళ్లీ సమ్మె భేరి మోగించబోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 7, 8, 9 తేదీల్లో కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ పాటించనున్నారు. ఆ తర్వాత 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.
Published Mon, Feb 3 2014 7:48 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
Advertisement