సీఎం కార్యాలయం ఎదుట ధర్నా | Marched in front of the CM office | Sakshi
Sakshi News home page

సీఎం కార్యాలయం ఎదుట ధర్నా

Published Wed, Sep 11 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

ఇద్దరు ఎంపీడీఓల అక్రమ బ దిలీని రద్దు చేయాలన్న డిమాండుతో టీజీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు,

 ఖమ్మం కలెక్టరేట్: ఇద్దరు ఎంపీడీఓల అక్రమ బ దిలీని రద్దు చేయాలన్న డిమాండుతో టీజీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు, టీ-ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రర్‌రావు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి, పంచాయతీరాజ్ కార్యదర్శి నాగిరెడ్డి, కమిషనర్ వరప్రసాద్, పం చాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీడీఓల బదిలీ వెనుక రాజ కీయ కుట్ర ఉందని అన్నారు. బదిలీల రద్దు జీఓకు విరుద్ధంగా, పాత జీఓలతో ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఇద్దరు ఎంపీడీఓలను అక్రమంగా బదిలీ చేయడం సరికాదని అన్నారు.
 
 మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
 ప్రభుత్వ నిబంధనలకువిరుద్ధంగా తమను బదిలీ చేశారని మానవ హక్కుల కమిషన్‌కు ముదిగొం డ, బోనకల్లు ఎంపీడీఓలు సన్యాసయ్య, చంద్రశేఖర్ మంగళవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశా రు. ఎలాంటి అవినీతి ఆరోపణలులేని తమను పాత జీఓలతో అక్రమంగా బదిలీ చేశారని వివరించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement