హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీఎన్జీఓల తీరుకు నిరసనగా ఏపీఎన్జీవో భవన్‌ను ముట్టడించేందుకు తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు బుధవారం ప్రయత్నించారు. కార్యాలయం ముందు బైఠాయించి అన్నదమ్ముల్లా కలిసుందామని... రాష్ట్రాలుగా విడిపోదామని వారు కోరారు. సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పారు.
ఈ నెల 7న ఏపీఎన్జీఓలు నిర్వహించ తలపెట్టిన సభను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. ఏపీ ఎన్జీవోలు ఏడో తేదీన తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏపీఎన్జీవో భవన్ ముట్టడికి యత్నం
Published Wed, Sep 4 2013 12:38 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement