రాష్ట్రాన్ని విభజించిన పాపం సీమాంధ్ర నేతలదేనని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు.
విజయనగరం: రాష్ట్రాన్ని విభజించిన పాపం సీమాంధ్ర నేతలదేనని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు. విభజనకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల అలసత్వం వల్లే రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిందన్నారు. భారత మాజీ ప్రధాని నెహ్రూ ఆనాడు చెప్పిన ఆంధ్ర, తెలంగాణను విడదీసిన పాపం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వర్తింస్తుందన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చించాలని గతంలోనే శ్రీకృష్ణ కమిటీ సూచించిందని, ఒకవేళ అలాకాకపోతే పౌరవిప్లవాన్ని చవిచూడాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పదవులకు రాజీనామా చేసిన వారి వెంటే ఉద్యోగ సంఘాల జేఏసీ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా భయపడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.