సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్సన
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్‌జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్‌జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.