వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు ప్రజలు ఎంత బాధ పడ్డారో.. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతోందని అంతగా బాధపడుతున్నారని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులవి రాజీనామా డ్రామాలేనని, వాళ్లలో ఎవరూ రాజీ నామాలు అధికారికంగా చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెల్యేల వద్ద హామీ తీసుకుంటామని ఆయన చెప్పారు. విభజన కొనసాగిస్తే ప్రజావిప్లవం తప్పదని అశోక్‌బాబు హెచ్చరించారు.