టీజేఏసీ బంద్ ను విజయవంతం చేయండి: కేసీఆర్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ (టీజేఏసీ) ప్రకటించిన బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ 7న జేఏసీ ప్రకటించిన బంద్ ను విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేసీఆర్ తెలంగాణవాదులకు విజ్క్షప్తి చేశారు.
తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే సెప్టెంబర్ 7 తేదిన బంద్ కు పిలుపునిచ్చామని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని, విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామని కోదండ్ స్పష్టం చేశారు.