సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఏపీఎన్జీఓలు గత అర్థరాత్రి నుంచి బంద్ను తీవ్రతరం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ.కే.మహంతి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏపీఎన్జీఓలు బంద్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశమై చర్చించినట్లు సమాచారం.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో ప్రజలకు అందించే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దాంతో సీఎస్ పలు శాఖ ఉన్నతాధికారులో సమావేశమై ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. అయితే ఆరోగ్యం, మున్సిఫల్ పరిపాలన, విద్యుత్ సమ్మె నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీఎన్జీఓలు ప్రకటించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి.