వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం
ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు.
జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు.
ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment