
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కడతానని చెప్పడం చూస్తుంటే ప్రజలను ఆయన మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పెద్దబజారులోని మీనాక్షి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 44, 46వ డివిజన్లకు సంబంధించి బూత్‌కమిటీ సభ్యులతో నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌తో కలసి మాజీ ఎంపీ మేకపాటి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో బూత్‌కమిటీ కన్వీనర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని చెబుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం బీజేపీతో జతకట్టినప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. తిరిగి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ కాంగ్రెస్‌తో జత కడతానని చెప్పడం చూస్తుంటే మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో అందరూ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం అన్నారు. బూత్ కమీటీ కన్వీనర్లు, సభ్యులు ప్రతి గడపకు వెళ్లి నవరత్నాల గురించి మళ్లీ ఒకసారి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వేలూరు మహేష్, నీలి రాఘవరావు, వేలూరు రఘు, మాళెం సుధీర్‌కుమార్‌రెడ్డి, బాలు స్వామి, అరవిందజైన్, నారాయణరెడ్డి, రాజేంద్ర, అశోక్ దాతియా, అశోక్‌రెడ్డి, జయకృష్ణ, రామలక్ష్మణ్, నిరంజన్‌రెడ్డి, మనోజ్, సురేష్, హరి, పెసల ఆనంద్, మల్లికార్జున్ పాల్గొన్నారు.