‘చంద్రబాబు దుర్మార్గాలు ఎండకడతాం’ | Mekapati Rajamohan Reddy And sajjala ramakrishna Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు దుర్మార్గాలు ఎండకడతాం’

Published Fri, Jun 1 2018 12:24 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Mekapati Rajamohan Reddy And sajjala ramakrishna Slams Chandrababu - Sakshi

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు ఎవరూ ఒప్పుకోకపోయినా కాంగ్రెస్‌-బీజేపీ కలిసి చీల్చాయన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి. నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీ ఏ హామీ నెరవేర్చకపోయినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మౌనంగానే ఉన్నారంటూ మండిపడ్డారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్‌ తగ్గుతుందని కొత్త పల్లవి అందుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఏపీలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వైఫల్యాలను కేవలం బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మేకపాటి వెల్లడించారు. కానీ చంద్రబాబు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రేపు (జూన్‌ 2న) నెల్లూరులో జరగనున్న వంచనపై గర్జన ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు దుర్మార్గాలు ఎండకడతామని, ప్రధాని మోదీ చేసిన అన్యాయాలను కూడా ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.

వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలు చెప్పడంలో ఏపీ సీఎం చంద్రబాబు దిట్టఅని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు మార్చుకుంటూ యూ టర్న్‌ తీసుకోవడంలో చంద్రబాబుకు ఏ నేత సాటిరారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో తానే ఛాంపియన్‌ అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోదా కోసం దేశమంతా చర్చ జరిగేలా చేసింది వైఎస్సార్‌సీపీ అని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా టీడీపీ ఎంపీలు ఇప్పటికీ డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువల కోసం నిరంతరం తపించే వ్యక్తి జననేత వైఎస్‌ జగనేనని సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement