
నగదు అందజేస్తున్న ఎంపీ రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొండాపురం సాయిపేటకు చెందిన శ్రీదేవి అనే మహిళకు రూ.15,000 ఆర్థికసాయాన్ని అందజేశారు. బుధవారం నెల్లూరులోని తన నివాసంలో ఆమెకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ శ్రీదేవి విద్యుత్ ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకుందన్నారు.
ఆమె భర్త కల్యాణ్ ఇద్దరు పిల్లలను, ఆమెను వదిలి వెళ్లిపోయిన విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. జన్మభూమి కమిటీల నిర్వాకం వల్ల ఆమెకు పింఛన్ రాలేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విభిన్న ప్రతిభావంతుల కోటా కింద పింఛన్ మంజూరు చేయాలని కోరానన్నారు. జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొండాపురం మాజీ మండలాధ్యక్షుడు యల్లాపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment