ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సోమవారం ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.