ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చేలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఆయా పార్టీలు చేస్తోన్న ఆందోళలను గౌరవిస్తూనే, వారి సమస్యలను అర్థం చేసుకుంటూనే.. ఏపీ ప్రజల ఆకాంక్షకు గుర్తించాలని కోరారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న ఆయన మంగళవారం ఉదయం ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు