
వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (ఫైల్)
సాక్షి, నెల్లూరు : అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. తన అనుకూల మీడియాలో అంతా తానే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన శనివారమిక్కడ ధ్వజమెత్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సాధించామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడేమో కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని చెబుతున్నారని ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారనీ, చంద్రబాబు తీరును ఎండగడతారని మేకపాటి వ్యాఖ్యానించారు.