వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6 వరకూ వేచి చూస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. అప్పటికీ ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన రాకపోతే పార్టీ ఎంపీలందరం కలసి రాజీనామా చేస్తామని తెలిపారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని అన్నారు. ఆయన్ను రాజకీయాల నుంచి వెలేయాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వైఎస్‌ఆర్ సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పార్టీ నేతలెవరూ పదవులను పట్టుకొని వేలాడరని పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ప్రకటన అనంతరం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటూ.. ప్రజల మేలు కోసమే పోరాడుతుందని చెప్పారు.
వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. గుంటూరులో వైఎస్ జగన్ నిరవధిక దీక్షను కూడా చేశారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోరాటంతోనే ప్రజల్లో ప్రత్యేక హోదాపై చర్చ మొదలైందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజి పేరుతో చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ ఎంపీలు నాటకాలాడుతున్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగినా.. కేంద్రమంత్రులు బడ్జెట్‌ను ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చంద్రబాబు ఇప్పటివరకూ ఎందుకు స్పందించలేదు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి పోరాడుతున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పారు. ఇకపై కూడా వైఎస్‌ఆర్ సీపీ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment