
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు) : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంపసముద్రంలో సోమవారం ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుందని, ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆత్మకూరులోని తమ కార్యాలయంలో ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని ఓఎస్‌డీ చెన్నయ్య చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు చెప్పాలన్నారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలసి మెలసి ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యాలయం సచివాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చెన్ను శ్రీధర్‌రెడ్డి, యర్రమళ్ల చిన్నారెడ్డి, గోపవరం కాంతారెడ్డి, బాబునాయుడు, కొండ్రెడ్డి రమణారెడ్డి, హజరత్ రెడ్డి, చిన్నమాచనూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment