ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వండి   | Support SC Classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వండి  

Published Mon, Mar 19 2018 9:09 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

Support SC Classification - Sakshi

ఎంపీ రాజమోహన్‌ రెడ్డికి వినతిపత్రం అందజేస్తోన్న ఎమ్మార్పీఎస్‌ నేతలు

నెల్లూరు రూరల్‌: ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్‌ నేతలు కోరారు. ఈ మేరకు పొదలకూరురోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మార్పీ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంద పెంచలయ్యమాదిగ మాట్లాడు తూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లుగా తెలి పారు.  

జిల్లాలోని అన్ని మం డల కేంద్రాల్లో ఈ నెల 21న రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కోలగట్ల రమేష్, పాపయ్య, బెల్లంకొండ గోపి, బర్రె ప్రసాద్, సుధా, మునె య్య  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement