
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీ పదవులను వదులుకొని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న లోక్‌సభ సభ్యుల దీక్షా శిబిరాన్ని ఆమె రేపు (ఆదివారం) సందర్శించనున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి వైఎస్ విజయమ్మ పరామర్శించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నందువల్ల ఆయన ప్రతినిధిగా విజయమ్మ ఢిల్లీ వెళుతున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేసి, అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment